Header Banner

ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు! అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ! తాజా పరిస్థితులపై..

  Wed Mar 05, 2025 16:51        Politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ(బుధవారం) ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరి విజయవాడ నగరం, పోరంకిలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాసానికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్తారు. గన్నవరం నుంచి బయలుదేరి 1.30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో ఓ శుభకార్యానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. తిరిగి రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి సీఎం చంద్రబాబు రానున్నారు. 6వ తేదీ ఉదయం 10.30 గంటలకు గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు.

 

ఇది కూడా చదవండి: సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 4 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. 5.30 గంటలకు భారత్ మండపంలో జరిగే రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌లో పాల్గొంటారు. 6వ తేదీ రాత్రి ఢిల్లీలోనే బస చేసి 7వ తేదీ ఉదయం బయలుదేరి అమరావతికి వస్తారు. సీఎం చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలను కలుస్తారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీకి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టుల అంశాలపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చిస్తారు. కాగా, రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం ఈ నెల 7వ తేదీన జరుగనుంది. ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌ హాల్‌లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ భేటీ జరుగనుంది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

 

వైజాగ్ ప్రజలు ఆందోళన.. ఏన్నో యేళ్ల చరిత్ర ఉన్న విశాఖ లైట్ హౌస్ ను కూల్చేస్తారా.?

 

తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి!

 

రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations